NTV Telugu Site icon

Mangaluru: ఇదెక్కడి మాస్ రా మావా.. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను మభ్యపెట్టి.. రూ.1.29 కోట్ల దోపిడీ..

Crime

Crime

అమెజాన్ ద్వారా కొత్త మార్గంలో మోసం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. మంగళూరులోని ఉర్వా పోలీసులు ఇద్దరు రాజస్థాన్ వాసులను అరెస్ట్ చేశారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి రూ.1.29 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాజస్థాన్‌కు చెందిన రాజ్‌కుమార్ మీనా, సుభాష్ గుర్జర్‌లు గత కొన్ని నెలలుగా పలు రాష్ట్రాల్లో అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను మోసం చేస్తున్నారు.

READ MORE: Maharashtra polls: ఇండియా కూటమికి షాక్.. చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్‌డ్రా

ఈ వ్యక్తులు తప్పుడు పేర్లతో వేర్వేరు ప్రదేశాల్లో హోమ్ స్టేలు లేదా సర్వీస్ అపార్ట్‌మెంట్లలో గదులు తీసుకునేవారు అమెజాన్‌లో మాక్‌బుక్, ఐఫోన్, సోనీ కెమెరా మొదలైన ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేసేవాళ్లు. వీరంతా క్యాష్ ఆన్ డెలివరీపై ఆర్డర్ చేసేవారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్రోడక్ట్ తెచ్చినప్పుడు.. ఒక వ్యక్తి తలుపు తెరిచి వస్తువులను లోపలికి తీసుకెళతాడు. డెలివరీ ఓటీపీ ఇస్తానన్న సాకుతో అవతలి వ్యక్తి డోర్ వద్ద నిల్చున్నాడు. అవతలి వ్యక్తి ఓటీపీ రాలేదని, అది తప్పు ఓటీపీ అని చెప్పి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు.

READ MORE:Teamindia: భారత్‌ను పాకిస్థాన్ ఓడించగలదు.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

ఎగ్జిక్యూటివ్ బయట వేచి ఉండగా.. సామానుతో లోపలికి వెళ్ళిన వ్యక్తి సామాను బయటకు తీసి, అదే బరువున్న మరొక వస్తువును ఉంచి నకిలీ టేపు ఉంచుతాడు. ఆ తర్వాత ఓటీపీ సమస్య ఉందని.. రేపు తీసుకో అని చెప్పి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కి తిరిగి పంపేవారు. దీంతో డెలివరీ ఎగ్జిక్యూటివ్ సరుకులు నకిలీవని గ్రహించ కుండా వెళ్లేవాడు.. దీంతో డెలివరీ ఎగ్జిక్యూటివ్ అక్కడి నుంచి వెళ్లగానే ఈ కేటుగాళ్లు ఆ ప్రదేశం నుంచి ఉడాయించే వాళ్లు. ఆయా వస్తువులను మార్కెట్‌లో అమ్మండం ద్వారా డబ్బులు కూడగట్టుకునే వాళ్లు. అదేవిధంగా రూ.1.5 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించి మోసానికి పాల్పడిన వారిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు సహా ఎనిమిది రాష్ట్రాల పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. అమెజాన్ భాగస్వామి లాజిస్టిక్స్ కంపెనీ మహీంద్రా లాజిస్టిక్స్ మోసం గురించి వెంటనే తెలియజేసిందని, అందువల్ల వారు పట్టుకోవచ్చని మంగళూరు పోలీసులు చెప్పారు.

Show comments