Hyderabad Crime: మాయ మాటలు చెప్పి బాలికపై గ్యాంగ్ రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నారులపై, మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. చాకెట్లు ఇస్తామని నమ్మించి అభం శుభం తెలియని చిన్నారులపై కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దేశంలో ఏదో ఓ మూల ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చుట్టు పక్కల వారు, చుట్టాలు, చివరికి కన్న తండ్రి, తండ్రి వరుస, అన్న వరుస అయ్యేవారు కూడా ఆడవారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మేడిపల్లిలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తరుచుగా గంజాయి సేవించే అలవాటు ఉన్న వారు బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలుసుస్తోంది. దీనికి సంబంధించి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Botsa Satyanarayana: స్కిల్ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే చర్యలు తప్పవు.. స్పష్టం చేసిన మంత్రి
వివరాల్లోకి వెళ్తే మేడిపల్లికి చెందిన ఓ మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు రేప్ చేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలకు తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందుతులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారు తమ ప్రాంతానికి చెందిన వారేనని బాధితులరాలి తల్లిదండ్రులు తెలిపారు. అంతేకాదు వారు తరచు గంజాయి తాగుతూ ఉంటారని కూడా వారు పోలీసులకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Tags
- Medipally
- minor girl
- rape
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!