NTV Telugu Site icon

Weather Update : తెలంగాణలో నేడు, రేపు పలు చోట్ల భారీ వర్షాలు

Rain

Rain

two more days rain in telangana

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడనంటున్నాయి. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. అయితే.. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే.. భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు మరోసారి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. జూరాల ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

Also Read : Viral Video: ఈ వీడియో చూశారో.. మరోసారి లిఫ్ట్‌ ఎక్కడానికి భయపడతారు!

జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 318.07 మీటర్ల వద్ద నీరు ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.65 టీఎంసీలకుగాను ప్రస్తుతం 8.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇదిలా ఉంటే.. ఏపీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నిన్న అనంతపురంలో భారీవర్షాలకు లోతట్టు ప్రాంతలు జలమయమయ్యాయి. దాదాపు 12 కాలనీలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. దీంతో వారిని బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అయితే.. ఇంకా వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.