NTV Telugu Site icon

Odisha Train Tragedy: గుర్తించలేని స్థితిలో ఇంకా 29 మృతదేహాలు.. ఏం చేయనున్నారు..?

Odisha Train

Odisha Train

ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 29 మృతదేహాలను గుర్తించలేదు. ఘటన జరిగి రెండు నెలలు గడుస్తుంది. జూన్ లో జరిగిన రైలు ప్రమాదంలో 294 మంది ప్రాణాలు కోల్పోయారు. 266 మృతదేహాలను గుర్తించి మృతుల బంధువులకు అప్పగించారు. మిగతా 29 మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చినట్లు ఎయిమ్స్ భువనేశ్వర్ సూపరింటెండెంట్ దిలీప్ పరిదా తెలిపారు.

BJP: తెలంగాణలో పర్యటించనున్న ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు

రైలు ప్రమాదం తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి మొత్తం 162 మృతదేహాలను వెలికితీశామని దిలీప్ కుమార్ పరిదా చెప్పారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన 81 మందిని మొదటి దశలో వారి కుటుంబ సభ్యులకు అందించామని ఆయన పేర్కొన్నారు. డీఎన్ఏ పరీక్ష ఫలితాల ఆధారంగా మరో 52 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. అయితే గుర్తింపబడని మృతదేహాల విషయంలో ఏమి చేయాలో కేంద్ర ప్రభుత్వం మరియు ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాయని దిలీప్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా రెండు అవకాశాలున్నాయి. మొదటిది, మృతదేహాలను ప్రభుత్వం దహన సంస్కారాలు చేయవచ్చు. రెండవది మృతదేహాలను పరిశోధన కోసం వైద్య కళాశాలకు పంపవచ్చు అని పేర్కొన్నారు.

Haryana CM: హర్యానా సీఎం వివాదస్పద వ్యాఖ్యలు..

జూన్ లో ఒడిశా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ రైలు ప్రమాదంలో 294 మంది మరణించగా, 800 మందికి పైగా గాయపడ్డారు. బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ రైలు ప్రమాదం దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా చెప్పవచ్చు.