2Job Notifications Cancelled: ప్రభుత్వ ఉద్యోగం ఎంతో మంది నిరుద్యోగుల కల. ఎలాగైనా సర్కారు కొలువు సాధించి జీవితంలో స్థిరపడాలని రాత్రనక, పగలక కష్టపడి చదువుతుంటారు. ఈ క్రమంలో కుటుంబాలను సైతం దూరంపెట్టి రోజుకు 18గంటల పాటు ప్రిపరేషన్ చేస్తుంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లే తక్కువ. ఏడాదికి ఒకటో, రెండో వచ్చే నోటిఫికేషన్లకు లక్షల్లో పోటీ ఉంటుంది. వాటి కోసం ప్రిపరేషన్ సాగించి.. తీరా పరీక్ష జరిగిన తర్వాత రద్దు చేస్తే.. అప్పటి వరకు నిరుద్యోగులు ఆ పరీక్షల కోసం కేటాయించిన సమయం, డబ్బు బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది.
Read Also: Jr.NTR Licious Add: టెంపర్ క్లైమాక్స్ లెవల్లో ఎన్టీఆర్ లేటెస్ట్ యాడ్
ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫారెస్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఇలానే జరిగింది. తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసుకుందామని.. ఆ నోటిఫికేషన్ ను తెలంగాణలో రద్దు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు రద్దు అవుతున్నాయి. ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ డీఎంఈ ఆధ్వర్యంలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లో 49 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు అప్లై చేసుకున్నారు. ఆ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా నవంబర్ 19న ముగిసింది. మొత్తం 49 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టుల నియామక నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది.
Read Also: China Fire Accident: చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది సజీవ దహనం
నియమాక ప్రక్రియలో ప్రైవేట్ కాలేజీల విద్యార్థులను అనుమతించలేదని కర్నూలుకు చెందిన డాక్టర్ ఝాన్సీ రాణితో పాటు మరికొందరు పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ ను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఏపీపీఎస్సీ అధికారులు 17 పోస్టుల కోసం ఏఎంవీఐ నోటిఫికేషన్ 2022ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో ప్రశ్నాపత్రం ఇంగ్లీష్‌లోనే ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని తూర్పుగోదావరి జిల్లా వాసి కాశీ ప్రసన్నకుమార్ హైకోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ప్రశ్నాపత్రం ఇస్తామనడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది తప్పుబట్టారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
