China Fire Accident: చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Fire Accident: సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 38 మంది కార్మికులు చనిపోయారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంతలో అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 200 మందికి పైగా ఉద్యోగులు మరియు దాదాపు 60 అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
Read Also: Hyderabad Traffic: హైదరాబాద్ జనాలకు హై అలర్ట్.. మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు
Also Read
మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బందికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందని స్థానిక అధికారులు తెలిపారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదానికి కారణమైన వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ నిమిత్తం పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై అధ్యక్షుడు షీ జిన్ పింగ్ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
Massive fire breaks out in China factory. 36 people said to have been killed in the accident in Henan province.#china#chinafire#henandead #chinafirevideo pic.twitter.com/UKTDBquzpY
— Ajay Saxena (@jxn66778) November 22, 2022
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు