Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. విద్యార్థుల బాధ్యతను తీసుకుంది.. ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా.. తల్లికి వందనం పథకం కింద.. అందరికీ ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం.. ఇప్పటికే విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ సొమ్ము జమ చేశారు.. అయితే, తల్లికి వందనం సొమ్ము మా అమ్మకు ఇవ్వొద్దు.. నాన్నకు ఇవ్వండి అంటూ ఇద్దరు చిన్నారులు అధికారులను ఆశ్రయించడం చర్చగా మారింది..
Read Also: Motorola Edge 60 Fusion vs OnePlus Nord CE 5: మిడ్ రేంజ్ లో ఏ ఫోన్ బెస్ట్..? ఎందుకు..?
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో అక్కాచెల్లెళ్ల వినూత్న ఆలోచనతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందన పథకం అమ్మ నుంచి పథకం ద్వారా వచ్చే డబ్బులు మా నాన్నకు ఇవ్వండి అంటూ అక్కాచెల్లెళ్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఐదేళ్లుగా నాన్న వద్ద ఉంటున్నామని.. తల్లి తమను వదిలి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. అంతేకాదు, ప్రతిసారి మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అమ్మకే వెళ్తున్నాయి.. కానీ, మా చదువుకు, అవసరాల కోసం ఎన్ని సార్లు అడిగినా డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆవేదన చెందారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం, పీజీఆర్ఎస్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద కూడా అర్జీలను ఇచ్చామని బాధిత అక్కా చెల్లెలు వాపోయారు. మరి విద్యార్థినుల అభ్యర్థనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..
