Site icon NTV Telugu

TDP: టీడీపీ రెండు కేంద్ర మంత్రి పదవులు

Tdp

Tdp

TDP: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ల పేర్లు ఖరారయ్యాయి. రామ్మోహన్‌ నాయుడికి కేంద్ర కేబినెట్‌ హోదా, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి.

Read Also: Modi swearing: రేపే మోడీ ప్రమాణస్వీకారం.. విపక్షాలకు అందని ఆహ్వానాలు

కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్‌ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టగలిగింది. ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఛాన్స్ లభించింది. అయితే వీరికి కేంద్రంలో ఏ శాఖ దక్కనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version