NTV Telugu Site icon

Ramanthapur SBI: రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం.. కోట్లు కొల్లగొట్టిన బ్యాంక్ మేనేజర్లు!

Sbi Logo

Sbi Logo

హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్లు భారీ మోసానికి పాల్పడ్డారు. లక్ష కాదు రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.2.80 కోట్లు కాజేశారు. ఖాతాదారులకు తెలియకుండా.. వారి డాక్యుమెంట్లు తీసుకుని మేనేజర్లు ఘరానా మోసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గతంలో షేక్ సైదులు, గంగ మల్లయ్యలు రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్లుగా పని చేశారు. ఖాతాదారులకు తెలియకుండా.. డాక్యుమెంట్లు తీసుకుని ఈ ఇద్దరు లోన్ అప్లై చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఏకంగా 19 మంది పేర్లపై లోన్లు తీసుకున్నారు. లోన్ అమౌంట్‌ను భార్య, కొడుకు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఖాతాదారులకు తెలియకుండా ఏకంగా రూ.2.80 కోట్లు ఇద్దరు మేనేజర్లు కాజేశారు.

Also Read: Pushpa Leela: కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్‌కి పట్టలేదు: పుష్ప లీల

రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు కొత్త మేనేజర్ రావడంతో.. షేక్ సైదులు, గంగ మల్లయ్యలు చేసిన మోసం బయటపడింది. వెంటనే కొత్త మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేనేజర్లు షేక్ సైదులు, గంగ మల్లయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన మేనేజర్ షేక్ సైదులు, అతడి భార్య సుష్మ, కొడుకు పీరయ్య పరార్ అయ్యారు. మరో మేనేజర్ గంగ మల్లయ్య కూడా పరారీలో ఉన్నాడు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు.