Ramanthapur SBI: రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం.. కోట్లు కొల్లగొట్టిన బ్యాంక్ మేనేజర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్లు భారీ మోసానికి పాల్పడ్డారు. లక్ష కాదు రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.2.80 కోట్లు కాజేశారు. ఖాతాదారులకు తెలియకుండా.. వారి డాక్యుమెంట్లు తీసుకుని మేనేజర్లు ఘరానా మోసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గతంలో షేక్ సైదులు, గంగ మల్లయ్యలు రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్లుగా పని చేశారు. ఖాతాదారులకు తెలియకుండా.. డాక్యుమెంట్లు తీసుకుని ఈ ఇద్దరు లోన్ అప్లై చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఏకంగా 19 మంది పేర్లపై లోన్లు తీసుకున్నారు. లోన్ అమౌంట్‌ను భార్య, కొడుకు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఖాతాదారులకు తెలియకుండా ఏకంగా రూ.2.80 కోట్లు ఇద్దరు మేనేజర్లు కాజేశారు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
Also Read: Pushpa Leela: కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్‌కి పట్టలేదు: పుష్ప లీల
రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు కొత్త మేనేజర్ రావడంతో.. షేక్ సైదులు, గంగ మల్లయ్యలు చేసిన మోసం బయటపడింది. వెంటనే కొత్త మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేనేజర్లు షేక్ సైదులు, గంగ మల్లయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన మేనేజర్ షేక్ సైదులు, అతడి భార్య సుష్మ, కొడుకు పీరయ్య పరార్ అయ్యారు. మరో మేనేజర్ గంగ మల్లయ్య కూడా పరారీలో ఉన్నాడు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!