పరాయి వ్యక్తులపై మోజు, అక్రమ సంబంధాలు భార్యాభర్తల బంధానికి బీటలుపారేలా చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రియుడి సాయంతో భర్తలను చంపేస్తున్నారు కొందరు భార్యలు. కొన్ని రోజుల క్రితం ఓ భార్య తన భర్తను సెల్ఫీ తీసుకుందామని చెప్పి నదిలోకి తోసేసిన విషయం తెలిసిందే. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఓ భయానక ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని పిలిచి, భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లాలో కలకలం రేపింది. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్తపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. భార్య మైనర్ కావడంతో భర్తపై పోక్సో కేసు నమోదు చేశారు. బాల్యవివాహం కావడంతో భర్త తాతప్పపై, ఆమె తల్లిదండ్రులపై పోక్సో కేసు నమోదు చేశారు.
Also Read:Tirumala: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అన్యమత ఉద్యోగులపై చర్యలు!
కర్ణాటక రాష్ట్ర రాయచూరు జిల్లా శక్తినగర్ మండలం కాడ్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది వద్ద భర్త తాయప్పను సెల్ఫీ తీసుకుందామని భార్య చిన్ని నది వద్దకు తీసుకెళ్లింది. అక్కడ సెల్ఫీ తీసుకునే సమయంలో భర్తను నదిలో తోసేసింది. తాయప్ప నదిలో కొట్టుకుపోతూ బయటపడేందుకు తీవ్రంగా యత్నించాడు. నది మధ్యలో ఓ బండరాయిని పట్టుకుని సహాయం కోసం ఎదురు చూశాడు. అయితే సమయస్ఫూర్తితో స్పందించిన గ్రామస్థులు తాడు సహాయంతో తాయప్పను నది నుంచి బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. అక్కడున్న వారు నదిలోకి ఎందుకు దూకావు అని ప్రశ్నించగా.. నేనెందుకు దూకుతాను నా భార్యే తోసేసింది అని చెప్పడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా విచారణలో భార్య మైనర్ అని తేలడంతో భర్తపై పోక్సో కేసు నమోదు చేశారు.
