TVS Apache RTR 200 vs Bajaj Pulsar NS200: భారతదేశంలో యువతకు ఎప్పటికీ ఫస్ట్ చాయిస్‌గా 200cc బైక్ సెగ్మెంట్ ఉంటుంది. పవర్, స్టైల్, బడ్జెట్ ఈ మూడు అంశాలు సమతుల్యం కావడం వల్ల ఈ కేటగిరీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో బజాజ్ పల్సర్ NS200, టీవీఎస్ అపాచీ RTR 200 4V మధ్య చాలా పోలికలు ఉన్నాయి. మరి ఇందులో ఏది బెస్ట్ ఏదో చూసేద్దామా!
డిజైన్:
పల్సర్ NS200 మస్క్యులర్, షార్ప్ డిజైన్‌తో స్ట్రీట్ ఫైటర్ లుక్ ను అందిస్తుంది. ట్యాంక్ ష్రౌడ్స్, అగ్రెసివ్ ఫ్రంట్ స్టాన్స్ బైక్ ను రోడ్డుపై ప్రత్యేకంగా నిలబెడతాయి. రఫ్ అండ్ టఫ్ స్ట్రీట్ స్టైల్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఛాయస్ గా మారింది. మరోవైపు అపాచీ RTR 200 4V మాత్రం రేసింగ్ డీఎన్ఏతో ట్రాక్ ఇన్స్పైర్డ్ డిజైన్‌ను ఇస్తుంది. ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ గ్రాఫిక్స్, స్లిమ్ ప్రొఫైల్ దీని ప్రత్యేకత. మోడ్రన్, రేసింగ్ స్టైల్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!
ఇంజిన్ & పనితీరు:
పల్సర్ NS200లో 199.5cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉండి సుమారు 24.5 PS పవర్, 18.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అపాచీ RTR 200 4Vలో 197.75cc ఇంజిన్ ఉండి సుమారు 20.8 PS పవర్, 17.25 Nm టార్క్ ఇస్తుంది. రెండు సరాసరి ఒక్కటే.. కానీ NS200 కొద్దిగా ఎక్కువ పవర్ కలిగి ఉంది.
ఫీచర్లు & టెక్నాలజీ:
ఫీచర్ల పరంగా అపాచీ RTR 200 ముందంజలో ఉంటుంది. ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. NS200లో సెమీ-డిజిటల్ కాన్సోల్, డ్యూయల్ ఛానల్ ABS వంటి అవసరమైన ఫీచర్లు ఉన్నప్పటికీ, కనెక్టివిటీ ఫీచర్లు పరిమితంగా ఉంటాయి.
రైడింగ్ కంఫర్ట్ & హ్యాండ్లింగ్:
NS200 సస్పెన్షన్ సెటప్ కొద్దిగా స్టిఫ్‌గా ఉంటుంది. స్పోర్టీ రైడింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. నగరంలోని చెడు రోడ్లపై కొద్దిగా హార్ష్‌గా అనిపించవచ్చు. అదే అపాచీ RTR 200లో అడ్జస్టబుల్ సస్పెన్షన్ మరియు మెరుగైన ఎర్గోనామిక్స్ ఉన్నాయి. దీని వల్ల లాంగ్ రైడ్స్‌లో తక్కువ అలసట అనిపిస్తుంది.
ViRosh: పెళ్లి తర్వాత తొలిసారి.. ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక జంట సందడి.!
మైలేజ్ & ధర:
అపాచీ RTR 200 సుమారు 40 నుండి 45 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. అదే పల్సర్ NS200 అయితే 35 నుండి 40 కి.మీ/లీటర్ వరకు ఇస్తుంది. ధర పరంగా చూస్తే రెండూ దాదాపు సమానమైన ధర పరిధిలోనే ఉంటాయి. 200cc సెగ్మెంట్లో పోటీదారులుగా నిలుస్తాయి.
మొత్తంగా.. మీకు ఎక్కువ పవర్, అగ్రెసివ్ స్ట్రీట్ లుక్ కావాలంటే పల్సర్ NS200 మంచి ఎంపిక. అదే ఆధునిక ఫీచర్లు, మెరుగైన మైలేజ్, కంఫర్ట్ కోరుకుంటే అపాచీ RTR 200 4V సరైన ఆప్షన్. మీ అవసరాలు, రైడింగ్ స్టైల్‌ను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.