NTV Telugu Site icon

Dharmapuri Arvind: పసుపు రైతులు ఇచ్చిన డిపాజిట్ ఖర్చుతో నామినేషన్ దాఖలు

Dharmapuri Arvind

Dharmapuri Arvind

Dharmapuri Arvind: నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అర్వింద్ నామినేషన్‌కు చందాల రూపంలో రుసుము జమ చేసి పసుపు రైతులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే డిపాజిట్ చెల్లించి ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు.

Read Also: Gaddam Vamshi Krishna: గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదు..

నామినేషన్ వేసిన అనంతరం నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. పసుపు రైతుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశానని.. డిపాజిట్ ఖర్చు కూడా రైతులు ఇవ్వటం సంతోషమని ఆయన అన్నారు. పసుపు రైతు రమేష్ తనకు ఈ ప్రపోజల్ ఇచ్చారన్నారు. పసుపుతో పాటు అన్ని రకాల పంటలపై దృష్టి పెడతామని..అన్ని పంటలకు మార్కెటింగ్,మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. భారత దేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా తీర్చి దిద్దటం మా మేనిఫెస్టోలో ఉందన్నారు. గల్ఫ్ వలసలు ఆపుతామమని.. ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. ఓట్లు తగ్గుతాయని భయంతో బీఆర్ఎస్. నేతలు కవిత ఫోటో పెట్టుకోవటం లేదని ఆయన విమర్శించారు.