తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే వాణిజ్య పంటలలో పసుపు కూడా ఒకటి.. భారతీయ మార్కెట్లో పసుపుకు భారీగా డిమాండ్ ఉంది. వ్యవసాయంలో ఉద్యాన మరియు వాణిజ్య పంటల సాగులో పసుపు పంట ముఖ్యమైనది.. మన రాష్ట్రంలో పండించే పసుపు అంతర్జాతీయంగా అధిక నాణ్యత మరియు అనువైన పంట గా చెప్పుకోవచ్చు. శుభకార్యాలలో ఏమి ఉన్న లేకున్నా పసుపు మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.. పసుపు ఉంటే రుచి కూడా ఎక్కువే.. అందుకే రైతులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
పసుపులో అధిక దిగుబడులతో పాటు మార్కెట్లో మంచి ధర పొందడానికి, నాణ్యమైన పసుపును పండించడానికి మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.. ఈ పసుపు పంటను మే నుంచి జూన్ మొదటి వారంలో విత్తుకుంటారు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పంటను వేస్తారు.. పసుపులో రకాలు..
స్వల్పకాలిక రకాలు: సుగుణ, సుదర్శన, ప్రగతి, ప్రతిభ, రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి ఈరకాలు సుమారు 7 నెలల్లో తవ్వకానికి వస్తాయి ఇవి కొంత వరకు దుంప కుళ్ళు అలాగే ఆకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటాయి.. దిగుబడి కూడా ఎక్కువే..
మధ్యకాలిక రకాలు: బి.ఎస్.ఆర్. 2 రోమా. సురోమా ఈరకాలు సుమారు 8 నెలల్లో తవ్వకానికి వస్తాయి
దీర్ఘకాలిక రకాలు : దుగ్గిరాల ఎరుపు, ఆర్మూర్, సేలం ఈరకాలు తొమ్మిది నెలల్లో పూతకు వచ్చి అధిక దిగుబడిని ఇస్తాయి.. ఎక్కువ మంది వీటినే ఎక్కువగా పండిస్తున్నారు..
అధిక వర్షాల కారణంగా పొలాల్లో నీళ్లు నిలబడి ఉంటే కాలువలు ద్వారా వర్షపు నీటిని తీసివేయాలి. పసుపులో పోషక లోపాలు ఉన్నట్లయితే ఆకుల అంచులు మాడిపోతాయి ముదురు ఆకులు పైకి లేదా కిందకు తిరిగి ఉంటాయి. దుంపలు ఎదుగుదల తగ్గిపోతుంది. పండిన కొమ్మలపైన ముడతలు ఏర్పడతాయి. ఇక ఈ పంటలో కూడా తెగుళ్లు ఎక్కువ.. సకాలంలో గుర్తించి మందులను వాడటం మంచిది.. పచ్చ బంగారంగా పిలువబడే పసుపు పంటను కొద్ది మంది రైతులే సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈపంట ఎక్కువగా సాగవుతుంది. పసుపు పండించే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే లక్షల్లో ఆదాయం పొందవచ్చు..