NTV Telugu Site icon

Tunisha Sharma Death Case: తునీషా శర్మ హత్య కేసులో షీజాన్ కు బెయిల్

Tunisha

Tunisha

Tunisha Sharma Death Case: ప్రముఖ టీవీ నటి తునీషా శర్మ ఉరి వేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. ఆమె మరణం యావత్ వినోద ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కేసులో తునీషా సహనటుడు, ప్రియుడు షీజాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 69 రోజుల జైలు శిక్ష తర్వాత షీజన్‌కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో షీజన్ ఖాన్ 2022 చివరిలో అరెస్టయ్యాడు. గత కొన్ని రోజులుగా బెయిల్ కోసం అతని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం, వసాయ్ కోర్టు షిజన్ ఖాన్‌కు లక్ష రూపాయల బాండ్‌పై బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు పాస్‌పోర్టును సరెండర్ చేయాలని ఆదేశించింది. అంటే ఆ నటుడు దేశం విడిచి ఎక్కడికీ వెళ్లలేడు. సాక్ష్యాలను తారుమారు చేయకూడదని, సాక్షులను కలవకూడదని షిజన్ ఖాన్‌కు కోర్టు షరతు విధించింది.

Read Also: Call Girl: కన్ను కొట్టిందని కార్లో ఎక్కించుకున్నాడు.. కాస్త దూరం వెళ్లగానే కంగుతిన్నాడు

నటి తునీషా శర్మ గతేడాది డిసెంబర్ 24, 2022న ‘ ‘అలీబాబా దస్తాన్‌ ఏ కాబుల్‌’ సీరియల్ సెట్స్‌లోని మేకప్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో షిజన్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. తునీషా తల్లి కూడా షీజాన్ పై పలు ఆరోపణలు చేసింది. తన కూతురిని ఆత్మహత్యకు పురికొల్పింది షీజన్ అని తునీషా తల్లి చెప్పింది. దీని తర్వాత డిసెంబర్ 25న షీజన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 69 రోజుల జైలు శిక్ష తర్వాత ఇప్పుడు బెయిల్ మంజూరైంది.

Read Also: Petrol Bunk: పెట్రోల్ బంక్‌లో అద్భుతం.. డీజిల్ స్థానంలో నీళ్లు?

షీజాన్‌, తునిషాల మధ్య కొన్నాళ్లు ప్రేమాయణం నడిచింది. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు సరిగ్గా 15 రోజుల ముందు తునిషాకు షీజాన్‌ బ్రేకప్‌ చెప్పాడు. దాంతో మనస్తాపానికి గురైన తునిషా ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని క్షణాల ముందు వరకు కూడా షూటింగ్‌ సెట్‌లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలపై షీజాన్‌ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.