Call Girl: హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో జరిగిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీ మేనేజర్ రోడ్డు పై కార్లో వెళ్తున్నాడు. ఎదురుగా ఓ అందమైన అమ్మాయి లిప్ట్ అడగడంతో ఆపేశాడు. కారు ఎక్కిన అమ్మాయి వద్దంటున్నా అక్కడ ఇక్కడ చేతులు వేయడంతో మనోడు మైమరచిపోయాడు. ఇంతలో తను దిగాల్సిన చోటు వచ్చిందని చెప్పడంతో కారు ఆపేశారు. ఆమె కారుదిగి వెళ్లిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే ఏముంది మేనేజర్ చేతికి ఉండాల్సిన బ్రేస్ లెట్ మాయం. లేడి మాయలో నుంచి తేరుకున్న మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు.
Read Also: Gold : టాయిలెట్లో రూ.2కోట్ల బంగారం.. కంగుతిన్న కస్టమ్స్ అధికారులు
నళిన్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని తిరిగి ఇంటికి బయలు దేరాడు. రోడ్డు పై ఓ మహిళ లిఫ్ట్ అడగడంతో ఆమె కాల్ గర్ల్ అని తెలియక ఎక్కించుకున్నాడు. ఆమెను హుడా సిటీ మెట్రో స్టేషన్‌లో దించాడు. ఈ మధ్యలోనే ఆమె అతడినుంచి రూ. 1.25 లక్షల విలువైన బంగారు బ్రాస్‌లెట్‌ను దోచుకుంది. జరిగిన ఘటనపై నళిన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురుగ్రామ్ పోలీసులు దొంగతనం సెక్షన్ 424కింద మహిళపై FIR నమోదు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితురాలిని త్వరలో పట్టుకుంటామని సెక్టార్ 40 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సతీష్ కుమార్ తెలిపారు.
Read Also: Ileana: గోవా పాపకి సినిమాలు లేవు… సాంగ్స్ చేసుకుంటుంది…