Site icon NTV Telugu

Dadisetti Raja: తండ్రికి మద్దతుగా తనయుడి ప్రచారం

Dadisetti Raja

Dadisetti Raja

Dadisetti Raja :  కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిథ్యం వహిస్తున్న తుని నియోజకవర్గం ఇటు కూటమి, అటు అధికార పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్‌లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. గెలుపు కోసం అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో, మంత్రి దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ మల్లిక్ తన తండ్రి గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

కోటనందూరు మండలం కె.ఈ చిన్నయపాలెం, భీమవరపు కోట గ్రామాలలో ఇంటింటికి ఓటర్లను కలుస్తున్నారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో తన తండ్రి దాడిశెట్టి రాజాకి అండగా నిలవాలని కోరారు. తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న దాడిశెట్టి రాజాని.. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగనన్నని మరోసారి ఆశీర్వదించాలని దాడిశెట్టి శంకర్‌ మల్లిక్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పలువురు స్థానిక నాయకులు..కార్యకర్తలు..ప్రజలు ..ప్రచారంలో దాడిశెట్టి శంకర్‌ మల్లిక్‌ వెంట నడిచారు.

 

Exit mobile version