NTV Telugu Site icon

Tummala Nageswara Rao : చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీపుల్స్‌ ప్లాజా వద్ద చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చేనేత రంగం మన దేశపు పురాతన సంపద, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. చేనేత రంగంలో నిపుణులైన మన చేనేత కార్మికుల అంకితభావం, సృజనాత్మకత దేశానికి గర్వకారణమని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం పొందే విధంగా, వారికి అవసరమైన అన్ని సహాయాలు అందించడంలో ముందుంటామని ఆయన వెల్లడించారు.

CM Pinarayi Vijayan: వయనాడ్ బాధితులను కేంద్ర సర్కార్ అవమానిస్తుంది..!

అంతేకాకుండా.. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి, ధరిస్తూ మన నేతన్నకు అండగా ఉండాలని, ఇది కేవలం ఒక వస్త్రం కాదు, అది మన చేనేత కార్మికుల శ్రమకు, ప్రతిభకు ప్రతీక. చేనేత వస్త్రాల వినియోగం ద్వారా మనం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తామని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. చేనేత వస్త్రాలను ధరిద్దాం, నేతన్నకు అండగా నిలుద్దామని మంత్రి తుమ్మల అన్నారు.
Dorababu Pendem: వైసీపీకి మరో షాక్.. పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా