NTV Telugu Site icon

Tummala Nageswara Rao : భద్రాచలానికి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది

భద్రాచలం స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలానికి నాకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర గుర్తు చేశారు. గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలోనే గోదావరి నదికి కరకటం నిర్మించాలని అది వరదల్లో కొండంత అండగా భద్రాచలంకి నిలుస్తుందన్నారు తుమ్మల నాగేశ్వర రావు. అలాగే నేను మంత్రిగా ఉన్నప్పుడే భద్రాచలం రెండో బ్రిడ్జి శంకుస్థాపన చేయడం జరిగిందని మళ్లీ మీరంతా అవకాశమిస్తే దానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించే సువర్ణ అవకాశం కూడా నాకే వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు..

Jagdishwar Goud: శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యేగా గెలుపు నాదే.. కాంగ్రెస్ వైపే ప్రజలు

అంతేకాకుండా అనేక జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని హైదరాబాద్ నుంచి జగదల్పూర్ కి అలాగే వరంగల్ నుంచి చత్తీస్గఢ్ కి వయా వాజేడు మీదుగా మరొక జాతీయ రహదారి మంజూరు అయిందని తెలిపారు.. అయితే భద్రాచలం పంచాయతీని మూడు ముక్కలుగా విభజించి బిఆర్ఎస్ ప్రభుత్వం పాపం మూటగట్టుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భద్రాచలం ప్రజల అభీష్టానికి అనుగుణంగా భద్రాచలం అభివృద్ధి చేస్తామని పంచాయతీ విషయంలో కూడా అందరికీ ఆమోదయోగకరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు…. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన లొంగని నిజాయితీపరుడు వీరన్నని అటువంటి నిజాయితీపరుడు వదులుకుంటే అది పూర్తిగా భద్రాచలం యొక్క దురదృష్టం అని కాబట్టి ఇటువంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తుమ్మల.

Smartphone : మీ ఫోన్ బాగా స్లో అయ్యిందా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..