NTV Telugu Site icon

Tummala Nageswara Rao : చారిత్రక ఘట్టం సత్తుపల్లితో మొదలవుతుంది

Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చారిత్రక ఘట్టం సత్తుపల్లితో మొదలవుతుందన్నారు. సొంతంగా ఖర్చు పెట్టి అభ్యర్థులను గెలిపించే ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గం సత్తుపల్లి మాత్రమేనని, నేను, శ్రీనివాస్ రెడ్డి వేరు కాదన్నారు తుమ్మల నాగేశ్వర రావు. అహంకారం కు అతమాభిమనం మధ్య ఇప్పుడు పోటీ జరుగుతుందని, ప్రజల కోసం చిత్తశుద్దితో యజ్ఞం ల రాజకీయం చేశానన్నారు. సీతారామ ఇస్తనంటేనే ప్రభుత్వం లో చేరాననని తుమ్మల వ్యాఖ్యానించారు. చిన్నప్పుడే ఎన్టీఆర్‌ మంత్రి పదవి ఇచ్చారు.. మంత్రి పదవి అవసరం లేదు.. మంత్రి పదవి కోసం పార్టీలో చేరలేదన్నారు తుమ్మల.

Also Read : KTR: కామారెడ్డిలో కేటీఆర్‌ రోడ్ షో.. రేవంత్‌రెడ్డికి మంత్రి కౌంటర్‌

అందరూ ముఖ్యమంత్రులు ఉన్న నియోజకవర్గాలతో పోలిస్తే సత్తుపల్లి నెంబర్ వన్ అని ఆయన వ్యాఖ్యానించారు. 80, 90 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసెందుకు వస్తున్నారని, సత్తుపల్లి అభ్యర్ధి మట్టా రాగమయి నీ గెలిపిస్తే మేం గెలిచినంత సంతోష పదతామన్నారు తుమ్మల నాగేశ్వర రావు. ప్రజల శక్తి ముందు వందల కోట్లు లెక్క కాదని, పది రోజులు మీరు కష్టపడాలి..ఆ తరువాత మేం కష్టపడతామన్నారు తుమ్మల నాగేశ్వర రావు. ప్రజా అభిమానంతో 40 ఏళ్లుగా ప్రజల ముందు ఉంటున్నానని, డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుందన్నారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.

Also Read : Minister Adimulapu Suresh: నేను మంత్రిగా ఉన్నానంటే అది జగన్ పుణ్యమే..