NTV Telugu Site icon

Tummala Nageswara Rao : ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవు

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సదస్సుకు హాజరైన వ్యాపారవేత్తలకు తెలంగాణా లో ఉన్న అవకాశాలను వివరించా అని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం లో ఎయిర్‌పోర్టుల విషయంలో వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరానని, కొత్తగూడెం విమానాశ్రయం కోసం భూమి కేటాయింపు జరిగినా ముందడుగు పడలేదన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లా వరదల గురించి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చించానని, ఆయన కళ్ళారా చూశారు. అందుకే తగిన మొత్తంలో కేంద్రం నుంచి సహాయం అందజేయాలని కోరానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నివేదిక రాగానే త్వరగా సహాయం అందిస్తామని చెప్పారని, ఆయిల్ పామ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తేనే ఆ పంట సాగు చేసే రైతులకు ప్రయోజనం ఉంటుందని చెప్పాననన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

Ridhi Bedi: వలపు వల విసిరి.. న్యూడ్ వీడియో కాల్ కి రమ్మంటాడు.. జాగ్రత్త బాసూ!

అంతేకాకుండా..’దిగుమతులను తగ్గించి దేశీయంగా ప్రోత్సహిస్తే పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తగ్గించవచ్చని చెప్పాం. 28% ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను. ఆయిల్ ఫాం కు కేంద్రం కనీస మద్దతు ధర కల్పించాలని కోరాను. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ను కలిసి, తెలంగాణ లో ఎక్కువగా పండే పంటలకు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యాలని కోరాం. రైతు బంధు అంటే, పంట వేసే రైతుకు చేయూత. వ్యవసాయం చేసే రైతుకు చేయూత ఇవ్వాలనేదే రైతు బంధు. రైతు బంధు ఎవరు తీసుకోవాలో, కౌలు రైతులు, ఓనర్లు నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో పంటల భీమా విషయంలో, వచ్చే నెల నుంచి పంటలకు మేమే ప్రీమియం కట్టి పంటలకు ఇన్సూరెన్స్ చేస్తాం. పంటల ఇన్సూరెన్స్ కోసం 3 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా.

Mamata Banerjee: బెంగాల్ వరదల వెనుక ‘కుట్ర’.. కేంద్రమే కారణం!

ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవు. ఇక్కడి భూ చట్టాలు వేరు, ఏపీలో ఉన్న చట్టాలు వేరు. గత ప్రభుత్వ హయాంలో 20 లక్షల రైతులకే రుణమాఫీ చేశారు. ఇప్పుడు 42 లక్షల మంది రైతులున్నారు. రైతు క్షేమం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది. 5 ఏళ్లలో కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు. ఒకేసారి 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఇంకా అవసరమైన నిధులు సమకూరుస్తాం. పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ చేయనుంది. ప్రతిపంట, ప్రతిరైతు కు భీమా వర్తించేలా 3000 కోట్లతో ఇన్సూరెన్స్.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.