Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tuesday Bjp Lok Sabha Election Candidates Second List Release

Lok sabha election: బీజేపీ సెకండ్ లిస్ట్ రెడీ! పోటీలో కీలక వ్యక్తులు!

Published Date :March 12, 2024 , 4:43 pm
By Suresh Maddala
Lok sabha election: బీజేపీ సెకండ్ లిస్ట్ రెడీ! పోటీలో కీలక వ్యక్తులు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఏ క్షణములోనైనా సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. ప్రధాని మోడీ మరోసారి వారణాసి నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి రెండు సార్లు మోడీ భారీ విజయంతో గెలుపొందారు. మూడోసారి ముచ్చటగా ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేందుకు రంగంలోకి దిగారు.

ప్రధాని మోడీ నేతృత్వంలో సోమవారం జరిగిన ఎన్నికల సమావేశంలో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 99 స్థానాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. ఈ రెండో లిస్టులో కీలక మైన వ్యక్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులను ప్రకటించలేదు. తాజాగా బీజేపీ-కాంగ్రెస్-జనసేన పార్టీలో పొత్తు కుదుర్చుకున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఈ సెకండ్‌ లిస్టులో ఏపీ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.

రెండో జాబితాలో పలువురు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో తాజాగా రాజీనామా చేసిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే కర్ణాటకకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు బసవరాజు బొమ్మై, జగదీష్ షెట్టార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్లు రెండో జాబితాలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విశాఖ నుంచి జీవీఎల్.నరసింహారావు పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ శనివారంలోపు.. ఏదొక రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసినట్లు సమాచారం. ఏప్రిల్‌లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి మే నెలలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • candidates
  • lok sabha election
  • release
  • second list

తాజావార్తలు

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions