హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍లో తెలంగాణ టీటీడీపీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుంది. కాగా.. ఈ సమావేశంలో టీటీడీపీ ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో టీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ నేతలతో చర్చిస్తున్నారు.
Read Also: Bhagyashri Borse: పాప గట్టి ప్లాన్ తోనే టాలీవుడ్లో దిగినట్టుందే!
అలాగే.. ఈ సమావేశంలో అధ్యక్షుడి ఎంపికపై నేతల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు తీసుకుంటున్నారు. ముఖ్యనేతల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కార్యకర్తలను కలవనున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమిలోని ఒకటైన టీడీపీ పార్టీ.. తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీకి అధ్యక్షుడు ఎవరు లేరు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పార్టీకి అధ్యక్షుడిని నియమించి తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Kevin Sullivan: ప్రముఖ రెజ్లింగ్ లెజెండ్ కెవిన్ సుల్లివన్ కన్నుమూత