Bhagyashri Borse Intrested to be a Director and Producer too: మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె నటించిన మొదటి సినిమా కూడా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ఆమె దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైపోయింది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో జిక్కి అనే పాత్రలో నటించింది భాగ్యశ్రీ. ఈమెతో కలిసి రవితేజ చేసిన డాన్స్ స్టెప్పులు సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యేలా ప్రమోషన్స్ చేసింది సినిమా యూనిట్. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పోస్టర్ల మీద కూడా ఆమెకు సింహభాగం దక్కిందని చెప్పాలి.
Manchu Vishnu : కూతురు పుట్టినరోజు.. నటీనటులకు మంచు విష్ణు 10 లక్షల విరాళం
అలాంటి భామ తాజాగా మీడియాతో వరుస ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో భాగంగానే నిన్న ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో ఆమె ముచ్చటించింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆఫ్ ది రికార్డుగా కొన్ని విషయాలు పంచుకుంది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పారు కదా భవిష్యత్తులో పాట పాడే అవకాశం ఉందా అని అడిగితే కచ్చితంగా పాడతానని తనకు పాడటం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను ఇదే ఇండస్ట్రీలో ఉంటానని భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తానని నిర్మాతగా కూడా మారతానని అంటూ ఆమె కామెంట్ చేయడం గమనార్హం. ఈ లెక్కన చూసుకుంటే ఆమె అంత ఆషామాషీగా ఏమీ టాలీవుడ్ లోకి రాలేదు ఏదో గట్టి ప్లాన్ తోనే వచ్చింది. ఇక్కడ సెటిలైపోవాలని దర్శకత్వం నిర్మాణాల సైతం చేయాలని ఫిక్స్ అయింది అనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో?