డబ్ల్యూడబ్ల్యూఈలో ‘ది టాస్క్‌మాస్టర్’గా పేరొందిన అమెరికా రెజ్లింగ్ లెజెండ్ కెవిన్ సుల్లివన్ (74) కన్నుమూశారు. 1990లో డస్టీ రోడ్స్ మరియు హల్క్ హొగన్ వంటి తోటి లెజెండ్‌లతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. మే నెలలో కెవిన్ ప్రమాదానికి గురయ్యాడు. అనంతరం అతనికి అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స తర్వాత సెప్సిస్ మరియు ఎన్సెఫాలిటిస్‌తో సహా పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. సర్జరీ సక్సెస్ కాకపోవడంతో అప్పటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతూ చివరికి తుదిశ్వాస విడిచాడు.
కెవిన్ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ విచారం వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులకు, బంధువులకు సంతాపాన్ని తెలియజేసింది. స్పోర్ట్స్-వినోద చరిత్రలో ఒక ప్రత్యేకమైన. ప్రభావవంతమైన వ్యక్తి అని కొనియాడింది.