Site icon NTV Telugu

TTD : అలర్ట్.. తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో జారీ చేసే టోకెన్ల కౌంటర్‌లో మార్పు..

Ttd

Ttd

కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది భక్తులు ముందే శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వస్తే.. మరికొంతమంది భక్తులు నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలిపిరి నడక మార్గం నుంచే కాకుండా శ్రీవారి మెట్టు నుంచి కూడా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. అలిపిరి నడకమార్గంతో పోలిస్తే శ్రీవారిమెట్టు మార్గం మెట్లు తక్కువగా ఉండటంతో కొంతమంది భక్తులు అక్కడి నుంచి తిరుమలకు వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు.

READ MORE: Adavi Shesh : అడివి శేష్ ‘డకాయిట్’ నుంచి ఫైర్ థీమ్ రిలీజ్

ఇక తిరుమలకు కాలినడకన వెళ్లేవారికి టీటీడీ దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల వద్ద శ్రీవారి దివ్య దర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తోంది. అయితే.. శ్రీవారి మెట్ల వద్ద నడక మార్గంలో జారి చేసే టోకెన్ల కౌంటర్ ని తాత్కాలికంగా మార్పు చేసినట్లు టీటీడీ పేర్కొంది. శుక్రవారం నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మార్పు తాత్కాలికమే అని టీటీడీ ప్రకటించింది.

Exit mobile version