కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది భక్తులు ముందే శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వస్తే.. మరికొంతమంది భక్తులు నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలిపిరి నడక మార్గం నుంచే కాకుండా శ్రీవారి మెట్టు నుంచి కూడా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది.
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పేయుగుతుంది. నిన్న శ్రీవారిని 13085 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 5182 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… నిన్న శ్రీవారి హుండి ఆదాయం 82 లక్షలు. అయితే రేపటి నుంచి రెండు నెలలు పాటు అలిపిరి నడకమార్గం మూసివేశారు టీటీడీ అధికారులు జూన్ 1 నుంచి జూలై 31వరకు మరమత్తు పనులు కారణంగా ఈ మార్గం ముసేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడకమార్గాని వినియోగించు…