NTV Telugu Site icon

Tirumala: శ్రీవారికి గరుడ సేవ.. తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు

Ttd

Ttd

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలుదీరిన తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకోగా.. ఈ రోజు ఉదయం 8 గంటలకు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. ఇక, రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇస్తారు.. అయితే, గరుడ సేవను చూసి తరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.. ఈ సాడి తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి గరుడ వాహన సేవ దర్శనం లభించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. 2 లక్షల మంది భక్తులు మాడవీధులలోని గ్యాలరిల ద్వారా గరుడ సేవ విక్షించే అవకాశం కల్పించనున్నారు.. మాడవీధుల ఉరేగింపు సమయంలో ఐదు ప్రాంతాల వద్ద క్యూ లైన్‌ల ద్వారా భక్తులకు దర్శనం కలిగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి..

Read Also: Vijayashanti : వారికి సమాధానం చెప్పడం అంత అవసరం కాదు

మొత్తంగా గరుడ సేవ సంధర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. గ్యాలరిలో వేచివున్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం కల్పించనున్నారు. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. 5 వేల మంది సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేసింది టీటీడీ.. 2700 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. భధ్రతా ఏర్పాట్లను ఇద్దరు డీఐజీలు, ఐదుగురు ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. రేపు ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించారు.. నడకదారిలోనై ఆంక్షలు కొనసాగుతున్నాయి.. తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. తిరుమలకు విచ్చేసే మార్గాలలో వాహనాలకు టోకెన్లు అందిస్తామంటున్నారు పోలీసులు.. తిరుపతిలో మూడు ప్రాంతాలలో వాహనాల పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.. అలిపిరి వద్దే వాహనాల నియంత్రణ చేస్తున్నారు.

Show comments