NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala

Tirumala

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. భక్తుల కోసం డిసెంబర్‌ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జితసేవల, దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌ టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also: Palanje Ganesh Temple: 75 ఏళ్లుగా అక్కడి వినాయకుడికి నో నిమజ్జనం.. చివరి రోజు ఏం చేస్తారంటే?

ఇదిలా ఉండగా.. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వర్చువల్‌ సేవా టికెట్లను కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అలాగే 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేస్తామని పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లను ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. 24న ఉదయం 11గంటలకు రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3గంటలకు తిరుపతి, తిరుమలలో గదుల కోటాను విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవ కోటా టికెట్లను ఈనెల 27వ తేదీ ఉదయం గంటలకు విడుదల చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్‌ చేసుకోవాలని భక్తులను టీటీడీ కోరింది.