Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆఫ్ లైన్ విధానంలో టిక్కెట్ల జారీకి మంగళం పాడే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ లైన్ విధానంలో తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు దర్శన టిక్కెట్లను అధికారులు జారీ చేస్తున్నారు. ఇక, శ్రీవాణి భక్తులకు రేణిగుంట విమానాశ్రయంలో, తిరుమలలో టిక్కెట్లు జారీ చేస్తుంది. ఆఫ్ లైన్ కౌంటర్ల దగ్గర నిత్యం గందరగోళ పరిస్థితులతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Nandyal Tragedy: ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు మృతి
అయితే, ఆఫ్ లైన్ కోటాను కూడా ఆన్ లైన్ లోకి మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తుంది. సర్వదర్శనం, శ్రీవాణి టిక్కెట్లను ఒక్క రోజు ముందుగా ఆన్ లైన్ లో విడుదల చేసే యోచనలో టీటీడీ ఉన్నట్లు కనిపిస్తుంది. తిరుమల, తిరుపతి రేడియస్ లో మాత్రమే ఆన్ లైన్ లో దర్శన టిక్కెట్లు పొందేలా యాప్ ని రూపాందిస్తున్నారు. జనవరి నుంచే నూతన విధానాన్ని అమలు చేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది.
