TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన కోటా టికెట్లు విడుదల..

  • తిరుమల భక్తులకు శుభవార్త..
  • దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల..
  • ఈ రోజు మధ్యాహ్నం దర్శన కోటా టికెట్లు విడుదల..
Ttd

Ttd

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూన్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలనుకునే వారి కోసం టీటీడీ (TTD) టికెట్ల విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి వరుసగా వివిధ సేవా టికెట్లు, దర్శన స్లాట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి.

ఏ రోజు ఏ టికెట్లు విడుదలవుతాయంటే..?

నేడు (మార్చి 21):
వర్చువల్ సేవలకు సంబంధించిన దర్శన కోటాను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.

మార్చి 23వ తేదీ షెడ్యూల్..
ఉదయం 10 గంటలకు: అంగ ప్రదక్షిణ టోకెన్లు.
ఉదయం 11 గంటలకు: శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు. మధ్యాహ్నం 3 గంటలకు: వయోవృద్ధులు, దివ్యాంగులు , దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కేటాయించే ఉచిత ప్రత్యేక దర్శన కోటా విడుదల చేయనున్నారు.

Also Read:Fuel From Air: గాలి, నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. ఏం టెక్నాలజీ గురూ..

మార్చి 24వ తేదీ షెడ్యూల్..
ఉదయం 10 గంటలకు: రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు.
మధ్యాహ్నం 3 గంటలకు: తిరుమల మరియు తిరుపతిలో గదుల బుకింగ్ కోటా టికెట్స్ విడుదల చేస్తారు.

ఇప్పటికే మార్చి 20వ తేదీన సుప్రభాతం, తోమాల, అర్చన వంటి ఆర్జిత సేవలకు సంబంధించిన లక్కీ డిప్ కోటాను విడుదల చేశారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమకు కావాల్సిన టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.