కలియుగ వైకుంఠం భక్తులతో కిటకిటలాడుతోంది. రేపటి నుంచి పదిరోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం వుంటుంది. ఇవాళ అర్దరాత్రి 12 గంటల తరువాత ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరచుకోనున్నాయి. పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం రేపు ఉదయం 1.45 నిముషాలకు ప్రారంభం కానున్నాయి వీఐపీల దర్శనాలు. ఉదయం 5 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 గంటల నుంచి టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనుంది టీటీడీ.
రేపు ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి. ఎల్లుండి ఉదయం 4 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలకు భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. తిరుపతిలోనూ వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీప్రకియ కొనసాగుతోంది. వేకువజామున 3 గంటల నుంచే టోకెన్లు జారీచేస్తోంది టీటీడీ. దీంతో భక్తుల సందడి నెలకొంది.
Read Also: Ukraine War: విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం.. జెలన్ స్కీ న్యూఇయర్ సందేశం
నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. జమ్ము కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాధ్ తిలహరి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల కార్తీక్, ఏపీ డిప్యూటీ సీఎంలు ముత్యాల నాయుడు, నారాయణ స్వామి, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు తమిళనాడు మంత్రి గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ వున్నారు.
మరో వైపు తిరుమలలో భక్తులు పోటెత్తుతున్నారు. 15 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,460 మంది భక్తులు…తలనీలాలు సమర్పించిన 29,182 మంది భక్తులు…హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు అని టీటీడీ వెల్లడించింది.
Read Also: Rishabh Pant: అవన్నీ తప్పుడు వార్తలు.. అదే నిజమైతే పంత్ బతికేవాడు కాదు