Site icon NTV Telugu

Fake Websites: టీటీడీ పేరుతో 40 ఫేక్‌ వెబ్‌సైట్లు.. నమ్మారా అంతే సంగతులు

Fake Websites

Fake Websites

Fake Websites: కలియుగ ప్రత్యక్ష దైవం, కొలిచినవారి కొలువు బంగారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. ఇక, ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత.. టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు, శ్రీవారికి నిర్వహించే వివిధ సేవలు, ప్రత్యేక పూజలు, గదుల బుకింగ్‌ ఇలా అన్నీ ఆన్‌లైన్‌లోనే పెడుతున్నారు.. ఈ కోటాకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మొత్తం కోటా బుకింగ్‌ పూర్తి అవుతుంది.. అయితే, ఇదే సమయంలో టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు హల్‌చల్‌ చేస్తున్నాయట.. టీటీడీ పేరుతో భక్తులను మోసం చేస్తున్న 40 వెబ్‌సైట్లను టీటీడీ గుర్తించింది.. ఆ 40 వెబ్‌సైట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ ఐటీ జీఎం సందీప్‌ రెడ్డి.. దర్శన టికెట్లు, వసతి గదుల కేటాయింపు, ఉద్యోగాలు కల్పిస్తామంటూ భక్తులను ఆ వెబ్‌సైట్ల మోసం చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చిన టీటీడీ.. వాటిపై చర్యలకు పూనుకుంది.. ఆయా ఫేక్‌ వెబ్‌సైట్ల నిర్వాహకులు భక్తులను, ప్రజలను మోసం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ 40 వెబ్‌సైట్లు చేస్తున్న మోసాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: Viral : హైట్ పెరగడానికి రూ. 1.35 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు.. చివరికి ఏం అయిందో తెలుసా..!

Exit mobile version