Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ.. కల్తీ నెయ్యి అంశంపై వివరణ

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. గత పాలక మండలి హయాంలో తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై వివరాలు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సంప్రోక్షణ చర్యల గురించి వివరించారు. కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ వద్దని పవన్ పేర్కొన్నారు.

Read Also: Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..

Exit mobile version