Site icon NTV Telugu

TTD : తిరుపతిలో ఇక రూమ్‌కోసం టెన్షన్‌ లేదు..

Ttd

Ttd

TTD : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు బస చేయడానికి గదులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం ఒక ముఖ్యమైన సూచన చేసింది. గదుల కోసం ఎలా ప్రయత్నించాలో వివరిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఇకపై తిరుమలలో గదుల కోసం వెతుకులాట ఆపండి.. తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (CRO)కు నేరుగా వెళ్లండి. అక్కడ మీ ఒరిజినల్ గుర్తింపు కార్డు (ID card) చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు గది కేటాయింపు వివరాలతో ఒక SMS వస్తుంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, “తొలుత వచ్చిన వారికి ప్రాధాన్యం” అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. అంటే, ముందుగా CRO కార్యాలయానికి చేరుకున్న భక్తులకు గదులు కేటాయించబడతాయి. ఈ కార్యాలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. కాబట్టి, తదుపరిసారి మీరు తిరుమల వెళ్లినప్పుడు, గదుల కోసం ఇబ్బంది పడకుండా నేరుగా CRO కార్యాలయానికి వెళ్లి, మీ బసను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. TTD అందిస్తున్న ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి…

OTT : ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అసభ్యకర కంటెంట్ పై సుప్రీంకోర్టులో పిటిషన్

Exit mobile version