TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!

Ttd

Ttd

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. జూన్ 13, 2026న నిర్వహించనున్న అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన ఈ-డిప్ (e-DIP) టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రకటించింది. అర్హత కలిగిన స్థానిక భక్తులు నిర్ణీత సమయంలో నమోదు చేసుకోవాలని సూచించింది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 11వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో ఈ-డిప్ ద్వారా ఎన్నికైన వారికీ జూన్ 13వ తేదీ శనివారం జరిగే అంగప్రదక్షిణ సేవలో పాల్గొనవచ్చు. అయితే ఈ రిజిస్ట్రేషన్‌ను కేవలం స్థానిక భక్తులకు మాత్రమే పరిమితం చేశారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, తిరుమల, చంద్రగిరి మండలం, రేణిగుంట మండలాలకు చెందిన భక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా టీటీడీ తెలిపింది.

×
×
Ad

అర్హత కలిగిన భక్తులు నిర్ణీత సమయ వ్యవధిలోనే తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనలు, అవసరమైన వివరాలను ముందుగానే తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. శ్రీవారి అంగప్రదక్షిణ సేవలో పాల్గొనే భాగ్యం కలిగేలా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ బోర్డు తెలిపింది.