Tsutomu Shibayama: తరాల జ్ఞాపకం.. డోరేమాన్ సృష్టికర్త కన్నుమూత.. యానిమేషన్ లోకంలో తీరని లోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tsutomu Shibayama: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులను తన యానిమేషన్‌తో అలరించిన ప్రముఖ దర్శకుడు షిబాయామా సుటోము (84) ఇక లేరు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, మార్చి 6న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సహ-వ్యవస్థాపకుడిగా ఉన్న ‘అజియా-డో యానిమేషన్ వర్క్స్’ స్టూడియో మార్చి 17, 2026న అధికారికంగా ప్రకటించింది.
READ ALSO: Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా షోలు రద్దు!
Also Read
20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం
షిబాయామా సుటోము పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ‘డోరేమాన్’. 1979లో ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించడం ప్రారంభించిన ఆయన, దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. కేవలం టీవీ సిరీస్‌నే కాకుండా, డోరేమాన్ ఫ్రాంచైజీలో వచ్చిన 22 ఫీచర్ చిత్రాలకు కూడా ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. జపాన్‌లో ఆయనను గౌరవపూర్వకంగా “జాతీయ యానిమేషన్ పితామహుడు” అని పిలుచుకుంటారు.
కెరీర్ విశేషాలు..
1963లో టోయీ యానిమేషన్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించారు షిబాయామా సుటోము. డోరేమాన్తో పాటు చిబీ మారుకో చాన్, లూపిన్ III, కైకెట్సు జోరోరి వంటి హిట్ సిరీస్‌లకు పనిచేశారు. 1978లో ఒసాము కోబయాషి – మిచిషిరో యమడాలతో కలిసి అజియా-డో యానిమేషన్ వర్క్స్ సంస్థను స్థాపించారు. యానిమేషన్ రంగానికి ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా, 2012లో జపాన్ ప్రభుత్వం ఆయనను ‘జీవిత సాఫల్య పురస్కారం’తో సత్కరించింది.
అంత్యక్రియలు పూర్తి
కుటుంబ సభ్యుల కోరిక మేరకు షిబాయామా అంత్యక్రియలు అత్యంత ప్రైవేటుగా నిర్వహించినట్లు స్టూడియో తెలిపింది. అందుకే ఆయన మరణవార్తను ఆలస్యంగా వెల్లడించినట్లు పేర్కొంది. త్వరలోనే అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
READ ALSO: Dhurandhar 2: రణవీర్ సింగ్ నటనకు ఐకాన్ స్టార్ ఫిదా.. ‘ధురంధర్ 2’ పై అల్లు అర్జున్ రివ్యూ వైరల్!
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!