NTV Telugu Site icon

Puvvada Ajay Kumar : స్లీపర్ ఎసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Lahari Bus

Lahari Bus

ఎల్బీ నగర్‌లో టీఎస్‌ఆర్టీసీ తొమ్మిది స్లీపర్ ఎసీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎం‌డీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ వచ్చే నెలలో 1000 ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభిస్తామన్నారు. ఆర్టీసీలో మరో 100 స్లీపర్ బస్సులు వస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు లేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. కాబట్టి గ్రామాల్లో కూడా కొత్త బస్సులు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ – హైదరాబద్ మధ్య రద్దీ ఎక్కువగా ఉందని, ఇంటర్ సిటీ బస్సులను త్వరలో తీసుకొస్తామన్నారు. ఆర్టీసీలో ఇప్పుడిప్పుడే నష్టాలు తగ్గుతున్నాయని, రాబోయే రోజుల్లో ప్రయాణికుల కోసం మరిన్ని సేవలు అందిస్తామన్నారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. బెంగుళూరు – వైజాగ్ వెళ్ళేందుకు ఈ స్లీపర్ బస్సులు ప్రారంభించామన్నారు. ఆర్టీసీలో ప్రయాణం భద్రంగా, క్షేమంగా ఉంటుందని ప్రయాణికులు నమ్మారని, ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించే విధంగా కొత్తగా లహరి బస్సులు తీసుకొచ్చామన్నారు.

Also Read : BJP Leader Murder: కలకలం రేపుతోన్న బీజేపీ నేత హత్య.. నాటు బాంబులతో దాడి, కత్తులతో నరికి..!

కొత్త ఎలక్ట్రికల్ బస్సులు ఈ ఏడాది లోనే వస్తున్నాయని, ప్రస్తుతం కొత్త బస్సుల శకం స్టార్ట్ అయ్యిందన్నారు. ప్రయాణికుల కోసం మరిన్ని సేవలు అందిస్తామని, ప్రయాణికులు ఆర్టీసిని ఆదరించాలన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కొత్త బస్సులే దర్శనం ఇస్తున్నాయని, లక్షల మందిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఎంతో కష్టపడి ప్రయాణికుల కోసం సేవలు అందిస్తున్నాయని, అక్యుపెన్సీ 69 శాతంకు పెరిగిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత.. టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. ఏసి స్లీపర్ బస్సుల్లో అనేక సదుపాయాలు ఉన్నాయని, ఆర్టీసిలో తీసుకున్న 760 బస్సుల్లో ఇప్పటి వరకు 500 బస్సులు ప్రారంభించామన్నారు. ఎల్బీనగర్, మియాపూర్, బీహెచ్‌ఈఎల్‌, ఎంజీబీఎస్‌ నుండి హుబ్లీ, విశాఖ, బెంగుళూరుకు ఈ బస్సులు నడుస్తాయని, ప్రతీ ఏటా బడ్జెట్లో నిధులు సీఎం కేసిఆర్ కేటాయిస్తున్నారన్నారు. కాస్త నష్టాలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయని, ప్రజలు ఆర్టీసీని ఆదరించాలన్నారు.

Also Read : Manchu Manoj: విష్ణు గొడవపై స్పందించిన మనోజ్…

Show comments