TSRTC: టీ-24 టికెట్ ధరలు పెంపు.. ధరలు జూన్ 16 నుంచి అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC బస్సు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. టీఎస్ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెరిగిన టికెట్ ధరలు అన్ని బస్సుల్లో లేవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించే T-24 టికెట్ ధరలు పెరిగాయి. ఈ టికెట్ ధర సాధారణ ప్రయాణికులకు రూ.90 నుంచి రూ.100కి పెంచారు. ఇక సీనియర్ సిటిజన్లకు టికెట్ ధర ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90కి పెంచారు. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు జూన్ 16 నుంచి జూలై 31 వరకు అమల్లో ఉంటాయని టీఎస్ఆర్టీసీ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో సాధారణ ప్రయాణికులకు రూ.100గా ఉన్న టీ-24 టికెట్ ధర ఏప్రిల్ 26న రూ.90కి తగ్గించారు.80 సీనియర్ సిటిజన్స్ కోసం. తాజా నిర్ణయంతో పాత ధరలు అమల్లోకి రానున్నాయి.
Read also: Kakani Govardhan Reddy: నెల్లూరులో అడుగుపెట్టేసరికి యువగళం అట్టర్ ఫ్లాప్.. కాకాని కీలక వ్యాఖ్యలు
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
కాగా.. ప్రయాణికులకు చేరువయ్యేందుకు టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ బస్సుల్లోనూ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్) అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ సదుపాయాన్ని తీసుకోవడం ద్వారా ప్రయాణికులు బస్సు వచ్చే సమయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగే 900 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇప్పుడు అన్ని సిటీ ఆర్డినరీ బస్సుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు బస్సు సమయాలు, వివరాలు, బస్టాప్‌కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థ ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా బస్టాప్‌ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే త్వరలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Amit shah Tour: అమిత్ షా పర్యటనకు తుఫాన్ ఎఫెక్ట్.. రద్దయ్యే అవకాశం..?
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!