Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tsrtc Conductor Committed Suicide In Bus At Thorrur

Bus Conducter: ఏం కష్టమొచ్చిందయ్యా.. డ్యూటీ చేసే బస్సులోనే ఉరేసుకున్నావు

Published Date :March 13, 2023 , 4:54 pm
By Rakesh Reddy
Bus Conducter: ఏం కష్టమొచ్చిందయ్యా.. డ్యూటీ చేసే బస్సులోనే ఉరేసుకున్నావు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bus Conducter: పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. కానీ, పెరిగిన ధరల కారణంగా.. కుటుంబంలో ఖర్చులు ఎక్కువయ్యాయి. అప్పు చేయక తప్పలేదు. దీంతో తిరిగి చెల్లించే దారి తోచక విధులు నిర్వహించే బస్సులోనే ప్రాణాలు తీసుకున్నాడు ఓ కండక్టర్. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. అతడి ఆత్మహత్యతో తెలంగాణ ఆర్టీసీలో విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Read Also:Teacher Obscene Videos: కీచక టీచర్.. విద్యార్థినులకు బూతు వీడియోలు చూపించి..

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓ ఆర్టీసీ కండక్టర్ తాను డ్యూటీ చేసే బస్సులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కంఠాయపాలెంకు చెందిన మహేందర్ రెడ్డి తొర్రూరు డిపోలో ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూలాగే ఆదివారం విధులకు హాజరయ్యాడు. ఉదయం పదకొండు గంటల సమయంలో డ్యూటీ రిజిస్టర్‌లో సంతకం పెట్టి డిపోలోకి వెళ్లారు. కానీ.. మళ్లీ తిరిగి రాలేదు. ఎంతసేపటికీ మహేందర్ రెడ్డి బయటకు రాకపోవటంతో.. సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. డిపో మొత్తం వెతికారు. ఎక్కడా కనబడకపోయేసరికి.. అతను డ్యూటీ చేసే బస్సులో చూసేసరికి.. మహేందర్ రెడ్డి కండువా ఉరేసుకుని విగతజీవిగా దర్శనమిచ్చాడు.

Read Also:Pregnants Problems in Agency: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. నిండు గర్భిణికి నరకయాతన

వెంటనే సెక్యూరిటీ సిబ్బంది డిపో అధికారులకు అందించారు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. మహేందర్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదా.. ఉన్నతాధికారుల వేధింపులే కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మహేందర్ రెడ్డి మృతికి ఆర్టీసీ డిపో ఉద్యోగులు, తోటి సిబ్బంది నివాళులర్పించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bus Conducter
  • suicide
  • Telangana State Road Transport Corporation
  • Thorrur
  • TSRTC

తాజావార్తలు

  • Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!

  • BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..

  • Dhurandhar 2 : దురంధర్ 2 కలెక్షన్ల ఊచకోత.!

  • Delhi: ఢిల్లీ అసెంబ్లీ గేట్లు బద్దలుకొట్టి, దూసుకెళ్లిన కారు.. అతిపెద్ద భద్రతా వైఫల్యం..

  • Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions