TSPSC Group 2: తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 783 గ్రూప్-2 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 18 నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొద్ది సేపట్లో ఇందుకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 16 వరకు గడువు ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఆ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: Corona BF7: ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ వస్తేనే ఎంట్రీ.. లేదంటే ఎయిర్ పోర్టులోనే బ్రేక్
ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో 503 గ్రూప్-1, 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తికాగా.. అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్-4 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 28న ప్రారంభంకావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో డిసెంబర్ 30కి వాయిదా వేసింది. హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మరోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగిస్తోంది.
Read Also: Asteroid: 51వేల కి.మీ. వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న ఆస్టరాయిడ్