Site icon NTV Telugu

TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక భేటీ

Tspsc Group 4 Exam

Tspsc Group 4 Exam

టీఎస్‍పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అయితే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీకైనట్లు ఆరోపణలు రావడంతో ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ అధికారులు సస్పెండ్ చేయగా.. మరో ఔటసోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భేటీ అయ్యింది.

Also Read : Prabhas:హెల్త్ చెకప్ కోసం విదేశాలకు ప్రభాస్..?

సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 5న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీ పై కమిషన్ చర్చించనుంది. ఏఈ పరీక్ష రద్దు చేసే యోచనలో కమిషన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. గ్రూప్- 1 పరీక్ష పై వస్తున్న అనుమానాలను కమిషన్ పరిశీలిస్తోంది. ప్రవీణ్ ఎగ్జామ్ సమయంలో వ్యవహరించిన తీరు… అతడి పేపర్ పై చర్చ నిర్వహించే అవకాశ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ అభ్యర్థుల ఆందోళనలు ఉదృతమైన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ కొనసాగుతోంది. లీకేజీల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులను కోరింది. సమావేశం అనంతరం మీడియా ప్రకటన విడుదలకు ఛాన్స్ ఉంది.

Also Read : Nandamuri Sisters: నందమూరి ఆడపడుచులను ఇలా ఎప్పుడైనా చూశారా..?

Exit mobile version