NTV Telugu Site icon

TSPSC: గ్రూప్-1 దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పొడిగింపు..

Group 1

Group 1

గ్రూప్-1 దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పొడిగించింది. మరో రెండురోజుల పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు గురువారం చివరి రోజు కాగా.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. చివరిరోజు టీఎస్పీఎస్సీ సర్వర్ పనిచేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో.. టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: Malla Reddy: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీమంత్రి కీలక ప్రకటన

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత నెల 19న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. కాగా.. బుధవారం వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం గురువారం సాయంత్రం 5గంటలకు గడువు ముగియడంతో.. మరో రెండ్రోజుల పాటు పొడిగిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారు ఆన్‌లైన్‌ https://www.tspsc.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21న జరుగనుంది.

Read Also: konda vishweshwar reddy: చేవెళ్లలో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది..