NTV Telugu Site icon

Group-3 Exams : గ్రూప్‌ -3 అభ్యర్థులకు అలర్ట్.. వచ్చే నెలలో హాల్‌టికెట్లు

Tgpsc Group 3

Tgpsc Group 3

Group-3 Exams : తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక అప్‌డేట్ అందించింది. నవంబర్ 17 , 18 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వచ్చే నెల 10 నుండి గ్రూప్ 3 హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే, TSPSC గ్రూప్-3 మోడల్ ఆన్సర్ బుక్‌లెట్‌లు అధికారిక వెబ్‌సైట్ https://websitenew.tspsc.gov.in/లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1388 గ్రూప్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకి వెళ్తే, TSPSC గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో మొదట 1363 పోస్టులతో 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదలైంది. తరువాత అదనంగా 13 పోస్టులు చేరడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1375కి పెరిగింది.

Arvind Kejriwal: ఢిల్లీలో ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం.. హిందూ-ముస్లిం కోణం లేదు..

నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించడంతో మొత్తం కొలువుల సంఖ్య 1388కి చేరింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేశారు. టీజీపీ ఎస్సీ తాజాగా సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది , మోడల్ ఆన్సర్ బుక్‌లెట్‌లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. టీజీపీ ఎస్సీ గ్రూప్-3 పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి, ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రతి పేపరును రాయడానికి రెండున్నర గంటల సమయం ఉంటుంది. అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది, ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో నిర్వహించబడతాయి.

Naga Vamsi: అందుకే లక్కీ భాస్కర్ ప్రీమియర్ షోలు.. నాగవంశీ కీలక వ్యాఖ్యలు

Show comments