తెలంగాణలో జులై 1న నిర్వహించిన గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. గ్రూప్-4 రిజల్ట్స్ కు ఇంకా సమయం ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో నోటిఫికేషన్ వస్తే భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏళ్లు పట్టేదని.. కానీ, ఇప్పుడు రెండు నెలల్లోనే పూర్తి చేస్తున్నామని తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి అన్నారు. నేడు (మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకట్రెండు సమస్యలకు వ్యవస్థనే తప్పు పట్టడం సరికాదు అని అన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: యార్లగడ్డ ఎపిసోడ్‌పై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయనిష్టం..!
కాగా, జులై1న నిర్వహించిన గ్రూప్-4 ఎక్సామ్.. మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది క్యాండిడెట్స్ పరీక్షకు హాజరయ్యారు. పేపర్-1కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరు కాగా.. ఇక పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, మరి కొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నామని జనార్థన్ రెడ్డి అన్నారు.
Read Also: Uttar Pradesh: శివుడికి శిరస్సును సమర్పించిన భక్తుడు.. ఎందుకో తెలుసా..?
అయితే, గ్రూప్-4 ఫలితాల విడుదలకు మరింత సమయం ఉందని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. దీంతో గ్రూప్-4 పరీక్ష రాసి అభ్యర్థులు ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియక తికమక అవుతున్నారు. కనీసం ప్రాథమిక కీ అయిన విడుదల చేయాలని కోరుతున్నారు. కీని రిలీజ్ చేసేందుకు ఇంతకు ముందు కమిషన్ ఓ తేదీని ప్రకటించింది. కానీ అది పేపర్ వ్యాల్యూయేషన్ ఆలస్యం కావాడంతో కీ ని విడుదల చేసేందుకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.