Site icon NTV Telugu

TSFCC: థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు… ఫిల్మ్ చాంబర్ కీలక ప్రకటన

Tsfcc

Tsfcc

థియేటర్లకు సంబంధించిన తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) ఒక ప్రకటన జారీ చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు సినిమా థియేటర్లను కేవలం షేర్ ఆధారిత వ్యవస్థ ద్వారా నడపాలని లేదా పర్సంటేజ్ పద్ధతుల ఆధారంగా నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారని కొన్ని న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ పూర్తిగా అసత్యమని, ఇటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని టీఎస్‌ఎఫ్‌సీసీ స్పష్టం చేసింది.

READ MORE: Jaipur: ఆభరణాల్లో వాటా కోసం తల్లి అంత్యక్రయలు ఆపిన కుమారుడు..(వీడియో)

అదే విధంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం 2025 మే 18న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కూడా చర్చ జరుగుతుందని పేర్కొంది. సమావేశం ముగిసిన తర్వాత అధికారిక సమాచారాన్ని విడుదల చేస్తామని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, సెక్రటరీ కె. అనుపమ్ రెడ్డి పేరుతో విడుదలైన లేఖలో పేర్కొన్నారు.

READ MORE: Pakistan: భారత్‌ని మరిచిపోండి, పాకిస్తాన్ ఈ రెండు రాష్ట్రాల GDPని కూడా దాటలేదు..

Exit mobile version