తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాల్లో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 20న జరిగిన ఈ పరీక్ష జరిగింది. ఈ ఎక్సామ్ కు రాష్ట్రవ్యాప్తంగా 22వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పాలిటెక్నిక్, బీఎస్సీ పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా నేరుగా ప్రవేశాలు కల్పిస్తుంటారు.
Also Read : WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్
అయితే ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంటకరమణ విడుదల చేయనున్నారు. ఫలితాలను మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రిలీజ్ చేయనున్నట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ వెల్లడించారు.
Also Read : Lifestyle : మగవాళ్ళు చేసే ఈ పనులు ఆడవారికి అస్సలు నచ్చవట..
