Site icon NTV Telugu

Breaking News : విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. ఈఆర్సీ కీలక నిర్ణయం..

Electricity Demand

Electricity Demand

విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ శుభవార్త చెప్పింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంకు విద్యుత్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను ఆమోదించిన ఈఆర్సీ.. విద్యుత్ వినియోగదారులకు భారం లేకుండా నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా.. తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు మాట్లాడుతూ.. కస్టమర్ ఛార్జీలలో మార్పు లేదని ఆయన వెల్లడించారు. డిస్కంల నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సబ్సిడీ, ఇరిగేషన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సబ్సిడీని డిస్కంలకు భారం పడకుండా రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం డిస్కంలకు రూ. 12,718.40 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు చెల్లించాలని నిర్ణయించిందని, దీనికి ఈ రోజు విద్యుత్ నియంత్రణ మండలి (ERC) ఆమోదించబడిందని ఆయన వెల్లడించారు. ట్రూ-అప్ ఛార్జీలు గత 15 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు.

Also Read : Airtel 5G Plus service: 500 నగరాల్లో 5G సేవలు.. డైలీ డేటా అన్‌లిమిటెడ్

అయితే.. గత సంవత్సరం.. విద్యుత్ చార్జీలు 19 శాతం పెంచాలని డిస్కంలు ప్రతిపాదించగా 14 శాతం పెంచేందుకు కమిషన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీల యూనిట్‌కి 40 పైసల నుంచి 50 పైసల వరకూ.. ఇతర వినియోగదారులకు యూనిట్‌కి రూపాయి చొప్పున చార్జీల మోత మోగింది. అలాగే డొమెస్టిక్ వినియోగదారులపై కొత్తగా ఫిక్స్‌డ్/ కస్టమర్ చార్జీలు విధించగా.. ఇతర వినియోగదారులపై కూడా అప్పటికే ఉన్న చార్జీలు పెరిగాయి. అయితే.. ఈ గతేడాదిలాగే ఈ ఏడాది కూడా విద్యుత్‌ చార్జీల మోత తప్పదని అందరూ భావిస్తుండగా.. ఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకోవడం.. ప్రజలపై కొంత భారం తప్పుతుందని అంటున్నారు.

Also Read : Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్‌కి ఊహించని షాక్.. ఆ ఇద్దరు ఔట్?

Exit mobile version