Site icon NTV Telugu

SSC Supplementary Results : విద్యార్థులకు అలర్ట్‌.. రేపు టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు..

Eset Results

Eset Results

ఇటీవల టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యా శాఖ శుభవార్త చెప్పింది. రేపు తెలంగాణ‌ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TSBSE) TS SSC సప్లిమెంటరీ పరీక్ష 2023ని 14 జూన్ నుండి 22 జూన్ 2023 వరకు నిర్వహించింది. మొత్తం 13.4శాతం మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడానికి తమ మార్కులు, గ్రేడ్‌ను మెరుగుపరచుకోవడానికి అర్హత లేని విద్యార్థులకు రెండవ అవకాశంగా TSBSE ఈ సెకండరీ అవకాశాన్ని అందించింది. అయితే.. సప్లిమెంటరీ పరీక్షలను 259 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా.. 71వేల 738 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

Also Read : Kishan Reddy : కాంగ్రెస్‌కు 10 ఎకరాలు.. బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాలు.. సైన్స్ సిటీకు మాత్రం స్థలం ఇవ్వరు

ఇదిలా ఉంటే.. ఇటీవల చార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ) ఇంటర్మీడియట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో హైదరాబాద్‌ విద్యార్థి వై గోకుల్‌సాయి శ్రీకర్‌ ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. 800 మార్కులకు 688 మార్కులు (86.00 శాతం) సాధించిన శ్రీకర్‌ ఫస్ట్‌ర్యాంకు సాధించాడు. పాటియాలాకు చెందిన నూర్‌ సింగ్లా రెండో ర్యాంకు, ముంబై విద్యార్థి కావ్య సందీప్‌ కొఠారి మూడో ర్యాంకు సొంతం చేసుకున్నారు. మే నెలలో ఈ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాల్లో గ్రూప్‌-1లో కేవలం 18, గ్రూప్‌ -2లో 23, రెండింటిలో 10 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

Exit mobile version