Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా టీఎస్ సింగ్ డియోను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే బుధవారం నియమించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో త్వరలో జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు జరిగిన సమీక్షా సమావేశంలో సింగ్ డియో నియామకాన్ని ప్రకటించారు. టీఎస్ సింగ్ డియో నియామకంపై భూపేష్ బఘేల్ అభినందనలు తెలిపారు. “మేము సిద్ధంగా ఉన్నాము” అని చెబుతూ వారిద్దరి చిత్రాన్ని పంచుకున్నారు. టీఎస్ సింగ్ డియో నియామకాన్ని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.. ఆయన నమ్మకమైన కాంగ్రెస్ నాయకుడు, సమర్థుడైన పరిపాలకుడని తెలిపారు. డిప్యూటీ సీఎంగా ఆయన చేసిన సేవ వల్ల రాష్ట్రం ఎంతో ప్రయోజనం పొందుతుందన్నారు.
2018లో, 15 సంవత్సరాల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి కుర్చీపై భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ డియో మధ్య ఆధిపత్య యుద్ధం జరిగింది. తర్వాత రెండున్నరేళ్లు సీఎం పదవిని బఘేల్‌కు, మిగిలిన సగానికి డీయోకు సీఎం పదవి ఫిక్స్ చేయాలని నిర్ణయించారు. అయితే ఆ ఫార్ములా అమలు కాకపోవడంతో డియోను కార్నర్ చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అప్పటి నుంచి టీఎస్ సింగ్ డియో, సీఎం భూపేష్ బఘేల్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో, డియో మాట్లాడుతూ.. “మీడియా మళ్లీ మళ్లీ ‘2.5-2.5 సంవత్సరాల సీఎం’ (2.5 సంవత్సరాల పాటు బఘేల్, 2.5 సంవత్సరాల పాటు డియో) ఫార్ములా గురించి అడుగుతోంది. అది జరగనప్పుడు ఇది బాధిస్తుంది. మూసిన తలుపుల వెనుక ఏమి జరుగుతుందో మాట్లాడే స్వేచ్ఛ లేదు.” అని కూడా ఆయన ఆరోపించారు. రాష్ట్ర శాసనసభలోని మొత్తం 90 మంది సభ్యులను ఎన్నుకునేందుకు 2023 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ నాటికి జరగాల్సి ఉంది.